Hoyna Hoyna Song lyrics in Telugu font. This nice melodious song is from "Gang Leader" movie. Actor is Nani.


వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాలగువ్వతో, కులికే పూలకొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేశా ఎగిరే పాలవెల్లితో, నడిచే గాజుబొమ్మతో బంధం ముందు జన్మదా ఏమో బహుశా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా


నా జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా గుండెల్లోన రెండో వైపే చూపి సంబరాన ముంచావే నేస్తమా నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ వెలిగే వేడుకవ్వనా, కలిసే కానుకవ్వనా పెదవుల్లోన నింపనా చిరుదరహాసం ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగులు దిద్ది వెయ్యనా ఇహ నా వేషం హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా

వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా

Interesting facts about Hoyna Hoyna song Lyrics:

SOme lines of the song which suit the movie and the story:

Palike Pala Guvvatho - grand mother Kulike Poola Kommatho - middle aged woman kasire Vennelammatho - lover Egire Paalavellitho - college girl Nadiche Gaju Bommatho - chinna papa